May 11,2023 23:41

బసవతారకరామ కాలనీ వద్ద పరిశీలిస్తున్న కలెక్టర్‌ తదితరులు

ప్రజాశక్తి-పరవాడ
మండలంలోని వివిధ గ్రామాల్లో పెండింగ్‌ పనులు పూర్తి చేయాలని ఇటీవల ఎమ్మెల్యే అదీప్‌ రాజ్‌ వినతిపత్రం ఇచ్చిన నేపథ్యంలో గురువారం జిల్లా కలెక్టర్‌ రవి పఠాన్‌శెట్టి మండలంలో పర్యటించారు. గొర్లివానిపాలెం పంచాయతీ పరిధి జెఎన్‌ఎన్‌యుఆర్‌ఎం ఇళ్ల సముదాయం బసవతారకరామనగర్‌ కాలనీలో వున్న ఇండోర్‌ స్టేడియంను సందర్శించారు. బుష్‌, జంగల్‌ క్లియరెన్స్‌ చేసి, పెండింగ్‌లో ఉన్న నిర్మాణాలను పూర్తి చేయాలని, బౌండరీలు ఫిక్స్‌ చేసి వెంటనే చర్యలు చెప్పట్టలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వైసిపి రాష్ట్ర సీఈసీ సభ్యులు పైల శ్రీనివాసరావు, జెడ్పీటీసీ పైల సన్యాసిరాజు, గొర్లివానిపాలెం సర్పంచ్‌ గొర్లి గోపి అమ్మలు, ఎంపీడీఓ హేమసుందరరావు, తహసీల్దార్‌ ప్రకాష్‌రావు, పెద్ద చెరువు రైతు సంఘం అధ్యక్షులు రెడ్డి శ్రీనివాసరావు, వైసిపి నాయకులు పైల పైడంనాయుడు, వర్రి హరి, అధికారులు పాల్గొన్నారు.