Aug 11,2023 21:01

ఆర్‌బికెలో ఎరువులు పరిశీలిస్తున్న ఛైర్మన్‌, అధికారులు

ప్రజాశక్తి - గోనెగండ్ల
మండల వ్యవసాయ సలహా మండలి సమావేశాల్లో నిర్వహించే చర్చల ద్వారా రైతులకు ఉపయోగకరమైన నిర్ణయాలు తీసుకుంటామని జిల్లా వ్యవసాయ సలహా మండలి ఛైర్మన్‌ బెల్లం మహేశ్వర రెడ్డి తెలిపారు. శుక్రవారం మండలంలోని హెచ్‌.కైరవాడి ఆర్‌బికెలో గోనెగండ్ల మండల వ్యవసాయ సలహా మండలి సమావేశం నిర్వహించారు. ఎమ్మిగనూరు ఎడిఎ మహ్మద్‌ ఖాద్రీ, ఎఒ జి.హేమలత ఆధ్వర్యంలో నిర్వహించారు. ముఖ్యఅతిథిగా మహేశ్వరరెడ్డి హాజరయి మాట్లాడారు. మండల వ్యవసాయ సలహా మండలి నిర్ణయాలను జిల్లా వ్యవసాయ సలహా మండలి సమావేశంలో పరిశీలించి రైతులకు ఉపయోగకరమైన నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు. ఎఒ ద్వారా అమలయ్యే పథకాలను రైతులకు వివరించారు. అనంతరం ఆర్‌బికెలలో ఎరువులను పరిశీలించి రైతులకు ఎరువులు పంపిణీ చేసి, రైతు భరోసా మాస పత్రికలను అందజేశారు. ఉద్యానవన శాఖ అధికారిని శ్రీవాణి, విఎహెచ్‌ స్వామి, విఒఎ లక్ష్మన్న పాల్గొన్నారు.