
ప్రజాశక్తి - కడియం ఎపి మండలి ఛైర్మన్ కొయ్యే మోషేన్‌రాజును కడియంలో జరిగే కార్యక్రమంలో పాల్గొనాలని బాధ్యతా సేవా సంస్థ అధ్యక్షులు, వైసిపి రాష్ట్ర కార్యదర్శి గిరజాల బాబు, ది ఆర్యాపురం అర్బన్ బ్యాంక్ ఛైర్‌పర్సన్ గిరజాల రామకృష్ణ తులసి దంపతులు ఆహ్వానించారు. భీమవరంలోని ఆయన స్వగృహాంలో ఆదివారం కలిసి కడియం హైస్కూల్ మైదానంలో తన తండ్రి పేరున ఏర్పాటు చేసిన గిరజాల కృష్ణారావు కళావేదిక ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనాలని ఆహ్వానపత్రికను అందించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా బాధ్యత సేవా సంస్థ గత 15 సంవత్సరాలుగా ప్రజల కోసం చేస్తున్న సేవా కార్యక్రమాలను ఆయనకు వివరించినట్లు బాబు తెలిపారు.