రూ.20 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణం
ప్రజాశక్తి - చింతలపూడి
మండల అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు ఎంపీపీ రాంబాబు తెలిపారు. రేచర్ల పంచాయతీలో జిజిఎంపి గ్రాంట్ రూ.20 లక్షలతో ఎస్‌సి, బిసి ఏరియాలో సీసీ రోడ్డు నిర్మాణంను ఎంపీపీ సర్పంచి శివరామకృష్ణతో కలిసి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్‌సి, బిసి ఏరియాలో రోడ్డు లేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. దీంతో రోడ్లు వేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసిపి గ్రామ ప్రెసిడెంట్ సుబ్బారావు, సచివాలయం కన్వీనర్ మాధవరావు, గోపాలకృష్ణ, నాయకులు అడపా అప్పయ్య, ఉప్పాల శ్రీను, చిక్కాల శ్రీను, ముత్యాలు, డీలర్ శివ, లాజర్, చెన్నయ్య, సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు.










