మాట్లాడుతున్న ఎంపిడిఒ
ప్రజాశక్తి - పంగులూరు : అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు సమన్వ యంతో పనిచేసి మండలాభివృద్ధికి కృషి చేయాలని ఎంపిడిఒ రమణమూర్తి తెలిపారు. ఎంపిపి తేళ్ల నాగమ్మ అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం బుధవారం నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఎంపిడిఒ మాట్లాడుతూ గ్రామాల్లో మంచినీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు తీసు కోవాలన్నారు. వేసవిలో ప్రజల ఆర్యోగాన్ని కాపాడాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. జగనన్న విద్యా కానుక విద్యార్థులకు సక్రమంగా అందేలా చూడాలన్నారు. ఎంపిపి తేళ్ల నాగమ్మ మాట్లాడుతూ మండల పరిషత్ ద్వారా అమలయ్యే అన్ని పథకాలను అర్హులైన ప్రజలకు అందించేందుకు అధికారులు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపిపి ఎర్రం శ్రీనివాస్ రెడ్డి, సర్పంచులు, ఎంపిటిసిలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.










