Aug 14,2023 20:21

సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే ద్వారకనాథ్‌రెడ్డి

బి.కొత్తకోట : నియోజకవర్గ పరిధిలోని పెద్దతిప్పసముద్రం మండల సర్వతోముఖాభివద్ధికి చొరవ చూపాలని అధికారులను ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్‌రెడ్డి ఆదేశించారు. సోమవారం పెద్దతిప్పసముద్రం ఎంపిడిఒ కార్యాలయంలో మండల అభివద్ధిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంచాయతీ పరిధిలో మురుగునీటి కాలువలను నిర్మించడానికి, నీటి సమస్య లేకుండా చూడడం, అర్హులైన వారికి 90 రోజుల్లో గహనిర్మాణ పథకం కింద గహాలు మంజూరుకి కషి చేయాలన్నారు. విధులు నిర్వహణలో నిర్లక్ష్యం వ్యవహరించకుండా సకాలంలో పనులు చేసి ప్రజల నుంచి మంచి పేరు పొందాలని సచివాలయ సిబ్బందికి సూచించారు. ఏరాష్ట్రంలో లేనివిధంగా రైతులు సంక్షేమం మహిళాభివద్ధి, విద్య, వైద్యంపై కోసం అధిక నిధులను ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి మంజూరు చేశారని అన్నారు. మండలంలో శాఖల వారీగా పనితీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండి వారి సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలన్నారు. కార్యక్రమంలో ఎంపిపి మహమ్మద్‌, ఎంపిడిఒ గిరిధర్‌రెడ్డి, జడ్‌పిటిసి ఉంగరాల శివన్న, సర్పంచ్‌లు నాగరత్న, భాస్కర్‌నాయుడు, శంకర, సుబ్బిరెడ్డి, పెద్దతిప్పసముద్రం మాజీ సర్పంచ్‌ అలీ ఖాన్‌, సచివాలయం కన్వీ నర్లు జిల్లా ప్రచార కార్యదర్శి అయూబ్‌ బాషా, విఆర్‌ఒలు, సచివాలయ ఇంజనీరింగ్‌ అసిస్టెంట్లు పాల్గొన్నారు. తంబళ్లపల్లి: మండల అభివద్ధిపై దష్టి పెట్టి ప్రజా సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్యే పెద్దిరెడ్డిఆదేశించారు. సోమవారం శ్రీశక్తి భవన్‌లో అధికారులు, ప్రజా ప్రతినిధులతో అభివద్ధిపై సమీక్ష సమావేశం జరిగింది. అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులు గ్రామ వాలంటీర్లు, గహసారథులు కలిసి సమిష్టిగా ప్రతి గ్రామంలో పర్యటించి ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం అమలు పరిచిన సంక్షేమ చేకూరిన లబ్ధిని వివరించాలన్నారు. ప్రజల సమస్యలను గుర్తించి అక్కడికక్కడే పరిష్కరిం చాలని ఆదేశించారు. క్లిష్టమైన సమస్యలు ఉంటే నివేదికలలో పొందుపరిచి తన దష్టికి తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ శాలికా ర్పోరేషన్‌ డైరెక్టర్‌ సురేంద్రనాథ్‌, మండల అభివద్ధి కమిటీ చైర్మన్‌ నారాయ ణరెడ్డి, మల్లయ్య కొండ చైర్మన్‌ మల్‌ రెడ్డి, చైర్మన్‌ రెడ్డి మల్‌ రెడ్డి, సింగల్‌ విండో చైర్మన్‌ భార్గవ్‌ రెడ్డి, వైయస్‌ ఎంపీపీ కరీం, నాయకులు కోటిరెడ్డి, శివారెడ్డి, సర్పంచుల సంఘం అధ్యక్షుడు సుధాకర్‌ రెడ్డి పాల్గొన్నారు.