Jun 03,2023 23:12

భాష, గణిత ప్రదర్శనను తిలకిస్తున్న ఎంఇఒ అప్పలరాజు తదితరులు

ప్రజాశక్తి-సబ్బవరం
మండలంలోని వంగలి మండల పరిషత్‌ ప్రాధమికోన్నత పాఠశాలలో జి-20 జన్‌ భాగీదరి (టిఎల్‌ఎం)లో భాగంగా మండల స్థాయి భాష, గణిత ప్రదర్శన శనివారం ఏర్పాటు చేశారు. ఇందులో పాల్గొన్న ఎంఇఒ ఎస్‌.అప్పలరాజు మాట్లాడుతూ విద్యార్థులలో దాగివున్న ప్రతిభను వెలికతీసేందుకు భాష, గణిత మేళాలు దోహదపడతాయని తెలిపారు. ఇందులో ప్రతిభ కనబరిచిన విద్యార్థులు ఈ నెల 6న జరిగే జిల్లా స్థాయి ప్రదర్శనలో పాల్గొంటారని చెప్పారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్‌ఎం కెఎహెచ్‌.ప్రభాకరరావు, పేరెంట్స్‌ కమిటీ చైర్మన్‌ లగిశెట్టి దేముడు బాబు, ఉపసర్పంచ్‌ గొర్లే అప్పలనాయుడు, గ్రామపెద్దలు ఆకుల గణేష్‌, గవరరాజు, ముదపాక శంకరరావు, పొట్నురి అప్పారావు, ఉపాధ్యాయులు, అంగన్‌వాడీ టీచర్లు, సిఆర్‌పిలు, విద్యార్థులు పాల్గొన్నారు.
అనకాపల్లి : కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జన్‌ భాగీదరి కార్యక్రమం ద్వారా పిల్లల్లో అభ్యాసన, సహ పాఠ్యాంశాలపై నైపుణ్యాభివృద్ధి పెంపొందుతుందని కొత్త తలారివాని పాలెం ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు రెడ్డి నారాయణరావు అన్నారు. ఇందులో భాగంగా శనివారం తల్లిదండ్రులు, విద్యార్థులతో ప్రమాణం చేయించారు. అనంతరం విద్యార్థులు, తల్లిదండ్రులు వేసిన రంగురంగుల చిత్రలేఖన ప్రదర్శన నిర్వహించారు.