Sep 13,2023 23:43

ఆనందపురంలో పోటీలను ప్రారంభిస్తున్న ప్రజాప్రతినిధులు

ప్రజాశక్తి -యంత్రాంగం
ఆనందపురం:
స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ (ఎస్‌జిఎఫ్‌) ఆధ్వర్యాన ఆనందపురం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో మండల స్థాయి ఆటల పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను జడ్‌పిటిసి సభ్యులు కోరాడ వెంకట్రావు, స్థానిక సర్పంచ్‌ చందక లక్ష్మి ప్రారంభించారు. మండల స్థాయిలో జరిగిన ఆటల పోటీల్లో ఆనందపురం, గొట్టిపల్లి, బోని, సిర్లపాలెం, గిడిజాల, సొంఠ్యాం, గండిగుండం, రామవరం, వెల్లంకి, బోయపాలెం, తర్లువాడ, ప్రైవేటు పాఠశాల న్యూ లైఫ్‌ ఇంగ్లీష్‌ మీడియం పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.
మొదటిరోజు బాలురు ఆటల పోటీలు కబడ్డీ, ఖోఖో, వాలీబాల్‌, షటిల్‌ బ్యాడ్మింటన్‌, బాల్‌ బ్యాడ్మింటన్‌, త్రో బాల్‌, టెన్నికాయిట్‌, యోగ, అట్లాంటిక్‌ తదితర పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు బి.శ్రీనివాసరావు, మాజీ సర్పంచ్‌ మజ్జి వెంకట్రావు, మండల ఉపాధ్యక్షుడు పాండ్రంకి శ్రీను, పాఠశాల కమిటీ చైర్మన్‌ చందక అప్పలనాయుడు, నాయకులు పాండ్రంకి అప్పారావు, చందక సూరిబాబు, బి.రమణమ్మ, బంటుబిల్లి, ఆప్పలస్వామి, కొట్యాడ రమాదేవి, శినగం పెద్ద రామారావు, చిన రామారావు, చందక అప్పలస్వామి, కొట్టియాడ సత్యమూర్తి, కోరాడ అప్పలస్వామినాయుడు, వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
చిట్టివలస పాఠశాలలో...
తగరపువలస : స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యాన చిట్టివలస జెడ్పీ హైస్కూల్‌ క్రీడా మైదానంలో రెండ్రోజుల పాటు నిర్వహించే మండల స్థాయి క్రీడా పోటీలు బుధవారం ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. ఎంఇఒ ఎం.శివరాణి, జెడ్పీ హైస్కూల్‌ హెచ్‌ఎం పొట్నూరు మురళీ మోహనరావుతో కలిసి క్రీడా పోటీలను ప్రారంభించారు. జివిఎంసి ఒకటో జోన్‌, మండల పరిధిలోని పలు ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలకు చెందిన 6 నుంచి 10వ తరగతి చదువుతున్న బాలికలు సుమారు 400 మంది ఈ పోటీల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాల హెచ్‌ఎం సిహెచ్‌ రోజామణి, వ్యాయామ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షులు కె.సతీష్‌, స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ మండల ఇంఛార్జి సిహెచ్‌.వెంకటరెడ్డి, వివిధ పాఠశాలల వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.