మండల పరిషత్ వైస్ ఎంపిపి -1గా ఎన్నికైన పొలంరెడ్డి పెంచల్ రెడ్డి
ప్రజాశక్తి -రాపూరు :రాపూరు మండల పరిషత్ సమావేశ మందిరంలో జరిగిన ప్రత్యేక సమావేశంలో ప్రత్యేక అధికారి తిరుపతయ్య మండల వైస్ ఎంపిపి -1 ఎన్నిక జరిగింది. ఈ ఈ ఎనినకలో వైసిపి సభ్యుని పొలంరెడ్డి పెంచల్ రెడ్డిలు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ప్రత్యేక అధికారి తిరుపతయ్య నూతనంగా ఎంపికైన వైస్ ఎంపిపి పెంచల్ రెడ్డి చేత ప్రమాణ స్వీకారం చేయించి అభినందించారు. అనంతరం ఎంఎల్‌సి మేరిగ మురళి, ఎంపిడిఒ అప్పాజీ తో పాటు మండల నాయకులు పెంచల్ రెడ్డిని అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.










