Oct 25,2023 17:59

ప్రజాశక్తి - ముసునూరు
   నూతన తాత్కాలిక ఎంపిపిగా కోటగిరి రాజానాయన బాధ్యతలు స్వీకరించినట్లు ఎంపిడిఒ జి.రాణి తెలిపారు. బుధవారం మండల పరిషత్‌ కార్యాలయం వద్ద ఆమె విలేకర్లతో మాట్లాడుతూ ప్రస్తుత ఎంపిపి రాపర్ల కృష్ణకుమారి వయస్సు రీత్యా వృద్ధాప్యం, పలు అనారోగ్య కారణాలతో మండల ఎంపిపి పదవికి రాజీనామా చేసినట్లు ఆమె తెలిపారు. మరలా ఎంపిపి ఎన్నిక జరిగే వరకు రాజనాయన ఎంపిపిగా కొనసాగుతారన్నారు. త్వరలో ఎంపిపి అధ్యక్ష పదవికి ఎన్నికలు నిర్వహించినున్నట్లు తెలియజేశారు.