Jul 10,2023 16:22

పనులను పరిశీలిస్తున్న సర్పంచ్ శేషన్న

మండల నిధులతో తాగునీటి పైపు లైన్లు
ప్రజాశక్తి పగిడ్యాల

     మండల నిధులతో  దేవ నగర్ కాలనీలో తాగునీటి పైపులైన్లు వేయడం జరుగుతుందని సర్పంచ్ పెరుమాళ్ళ శేషన్న సోమవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. దాదాపు రూ 4 లక్షల వ్యయంతో పైపులు వేయడం జరుగుతుందన్నారు. తాగునీటి పైప్ లైన్ వేయడం వలన దేవ నగర్ కాలనీలోని తాగునీటి సమస్య పరిష్కారం అవుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.