
ప్రజాశక్తి- బాడంగి : ప్రజాప్రతినిధులు ప్రభుత్వ అధికా రులు సమన్వయంతో మండలాభివృద్ధికి కృషి చేయాలని మండల ప్రత్యేక అధికారి సూర్య చంద్రరరావు సూచించారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో శనివారం ఎంపిపి భోగి గౌరీ అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల పరిధిలోగల ఆయా గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులపై ఆరా తీశారు. మండల అభివృద్ధికి సంబం ధించిన 21 అంశాలపై ప్రభుత్వ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రజా ప్రతినిధులు అడిగిన పలు సమస్యలు అధికారులు పరిష్కరించాలని కోరారు. గ్రామాలను అభివృద్ధి చేయడంలో గ్రామ స్థాయి నాయకులు ప్రభుత్వ అధికా రులతో కలిసి పనిచేయా లన్నారు. ఈ సమాy ేశంలో ఎంపిడిఒ ఆంజినేయులు, ఇఒపిఆర్‌డి సూర్యనారాయణ, జెడ్‌పిటిసి రామారావు, ఎంపిపి సలహాదారు తెంటు మధుసూధన్, వైస్ ఎంపిపి రమేష్, సర్పంచ్‌లు, పాల్గొన్నారు.
ఎంపిడిఒ కార్యాలయం ముట్టడి
స్థానిక మండల పరిషత్తు కార్యాలయంలో శనివారం మండల సర్వ సభ్య సమావేశం జరగుతున్న విషయాన్ని తెలుసు కున్న గ్రీన్ అంబాసిడర్లు సిఐటియు ఆధ్వర్య ంలో కార్యాలయాన్ని ముట్టడించారు. గ్రీన్ అంబాసిడర్లకు జీతాలు చెల్లించలేని సమావే శాలెందుకని నినాదాలు చేశారు. ఈ సంద ర్భంగా సిఐటియు మండల నాయకులు సురేష్ మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారు ఆరు మాసాలుగా గ్రీన్ అంబా సిడర్లకు జీతాలు ఇవ్వలేదన్నారు. దీంతో కుటుంబ పోషణ కష్టంగా ఉందన్నారు. వెం టనే జీతాలను చెల్లించకపోతే సర్వసభ్య సమావేశం నిర్వహించడానికి వీలు లేదంటూ ఎంపిడిఒ కార్యాలయ గేటువద్దకు చేరుకు న్నారు. దీంతో సభ మధ్య నుంచి ఎంపిడిఒ గ్రీన్ అంబాసిడర్ల వద్దకు చేరుకొని సమస్యను పరిష్కరించే దిశగా మాట్లాడారు. 15 రోజుల్లో గ్రీన్ అంబాసిడర్ల మొత్తం జీతాలను చెల్లించే విధంగా చర్యలు చేపట్టాలని ఇఒపిఆర్‌డికి జెడ్‌పిటిసి రామారావు, ఎంపిపి సలహాదారు తెంటు మధుసూధన్ సూచించారు. దీంతో గ్రీన్ అంబాసిడర్లు నిరసనను తాత్కాలికంగా నిలిపివేశారు. 15 రోజులలో జీతాలు చెల్లించకపోతే మండల పరిషత్ కార్యా లయానికి తాళం వేసి భైఠాయిస్తామని హెచ్చరించారు.