Aug 16,2023 23:34

మండల అభివృద్ధికి అందరూ కృషి చేయాలి
ప్రజాశక్తి-యర్రావారిపాలెం: మండల అభివృద్ధికి అధికా రులు అందరూ మరింత కృషి చేయాలని అమర్‌నాథ్‌ పేర్కొన్నారు. బుధవారం మండలంలోని అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు కలిసి ఎంపీడీవో అధ్యక్షతన స్థానిక వెలుగు కార్యాలయంలో మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్పీటీసీ కరుణాకర్‌ రెడ్డి మాట్లాడుతూ మండల హౌసింగ్‌కు సంబంధించి ఇప్పటివరకు 1106 ఇండ్ల నిర్మాణానికి అనుమతి రాగా, అందులో 548 ఇండ్లు పూర్తిగా నిర్మాణం జరిగిందని, కొత్తగా ఇంటికి 324 మంది దరఖాస్తులు చేసుకోగా ఇంత వరకు శాంక్షన్లు రాలేదని హౌసింగ్‌ అధికారులపై మండి పడ్డారు. ఉస్తికాయల పెంట సర్పంచ్‌ రమేష్‌ మాట్లాడుతూ మండలంలోని ఎల్లమంద, నెరబైలు, యర్రావారిపాలెం లలో గల మూడు పీహెచ్‌సీ కేంద్రాలలో వైద్యులు సరిగా ప్ర జలకు అందుబాటులో ఉండడం లేదని, 104 వచ్చినప్పుడు మాత్రమే వైద్య పరీక్షలు చేస్తున్నారని, మిగతా సమయంలో ప్రజలను డాక్టర్లు పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ఆర్‌బికెలో జొన్నలు, మొక్కజొన్నలు, ఉలవలు రైతులకు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. మండల ఇరిగేషన్‌ లో తుడా ఆధ్వర్యంలో ఇప్పటివరకు 48 పనులు జరిగాయని, రోడ్డుకి ఇరువైపులా సైడ్‌ బోర్డులు పెట్టాలని పెండింగ్‌ పనులు త్వరలోనే పూర్తి చేస్తామని తెలిపారు. అలాగే మండలంలో కొత్త ఓటర్లపై సర్వే నిర్వహించి ఆన్లైన్‌ చేస్తున్నామని రైతులకు పాసుబుక్కుల్లో సర్వే నంబర్లు ఆన్లైన్‌ కావడానికి కొంత సమయం పడుతుందని రెవెన్యూ సి బ్బంది తెలిపారు. మండలంలో నిర్మించిన సచివాలయ, ఆ ర్బీకే, వెల్నెస్‌ బిల్డింగులకు బిల్లులు చెల్లించామని పీఆర్‌ఏఈ తెలిపారు. మండలంలో రైతులకు కరెంటు కోతలు లేకుం డా అందించేందుకు చూస్తున్నావని ఎలక్ట్రికల్‌ ఏఈ తెలిపా రు. కార్యక్రమంలో మండల వ్యాప్తంగా ఇప్పటివరకు 23 00 మంది విద్యార్థులకు జగనన్న విద్యా కానుకలో బ్యాగు లు, బుక్కులు, బూట్లు లాంటివి సక్రమంగా అమలు జరు గుతున్నాయని ఎంఈఓ బాలసుబ్రమణ్యం తెలిపారు. కార్య కమంలో ఏపీఓ ఆశారాణి, ఆర్‌ అండ్‌ బి ఏఈ మాధవ్‌, ఎంపీపీ, వైసీపీ నాయకులు చెంగల్‌ రెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీలు, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.