కావాల్సిన పదార్థాలు :
1 : కాలీఫ్లవర్ - అర కిలో, మైదా - రెండు టేబుల్ స్పూన్లు, మొక్కజొన్న పిండి- ఒకటిన్నర కప్పు, కారం - టేబుల్ స్పూను, ఉప్పు - టీస్పూను, మిరియాల పొడి - టీస్పూను, నీళ్లు - ఒకటిన్నర కప్పు.
2 : వెల్లుల్లి - నాలుగు (సన్నగా తరగాలి), అల్లం - అంగుళం ముక్క, టమాటా సాస్ - మూడు టేబుల్ స్పూన్లు, చిల్లీ సాస్ - టేబుల్ స్పూను, సోయా సాస్ - మూడు టేబుల్‌స్పూన్లు, అజినమొటో - టీ స్పూను, నూనె - తగినంత.
తయారుచేసే విధానం :
కాలీఫ్లవర్ మినహా 1 వ పాయింట్‌లోని అన్ని పదార్థాలను కలిపి చిక్కని పిండిలా కలుపుకోవాలి. అది బజ్జీల పిండిలా ఉండాలి.
ఈ పిండిలో కాలీఫ్లవర్ ముక్కలు ముంచి నూనెలో వేగించి పక్కన పెట్టుకోవాలి.
పాన్‌లో నూనెపోసి సన్నగా తరిగిన అల్లం, వెల్లుల్లి ముక్కలు వేసి వేగించాలి.
తర్వాత టమోటా, చిల్లీ, సోయా సాస్‌లు, అజినమొటో వేసి బాగా కలపాలి. చివరిగా వేగించిన కాలీఫ్లవర్ మరో రెండు నిమిషాలు వేగించాలి. స్ప్రింగ్ ఆకారంలో ఆనియన్‌లు తరుక్కుని అలంకరించుకుంటే చాలా బాగుంటుంది.