Jul 17,2023 23:54

వ్యాధులతో బాధపడుతున్న ఒకే కుటుంబ సభ్యులు

ప్రజాశక్తి-అనంతగిరి:ఇటీవల కురుస్తున్న వర్షాలతో మలేరియా, టైఫాయిడ్‌ వంటి విషజ్వరాలు విజృభిస్తున్నాయి. సకాంలలో వైద్య సేవలు అందక రోగులు మంచాన పట్టారు.అనంతగిరి మండలం పిన్నకొట ప్రభుత్వం ఆరోగ్య కేంద్రం పరిది పెద్దకోట పంచాయతీ కొండ శిఖరం గ్రామమైన మడ్రేబు గ్రామంలో సుమారు 30 మంది పైగా గిరిజనులు గత మూడు వారాల నుండి పలు వ్యాధులతో మంటం పట్టారు. పిన్నకోట ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి 30 కిలోమీటర్లు కొండకోన నడుమ నుండి పిన్నకొట ఆసుపత్రికి, అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలం వాలాబు పంచాయతీ బొడ్డగుమ్మి వరకు ఎనిమిది కిలోమీటర్లు డోలీలో వెళ్లాల్సి ఉంటుంది. అక్కడ నుంచి ఆటోలో దేవరాపల్లి చేరుతారు. కీర్తనకు డెంగీ ప్రబలడంతో కే.జీ.హెచ్‌ కి తరలించారు. కొండతాంబలి కవితకు జ్వరం, పిట్సు రావడంతో దేవరాపల్లి తరలించగా పరిస్థితి విషమంగా ఉండంతో మెగుగైన వైద్యం కోంసం కేజిహెచ్‌కు రిపర్‌ చేశారు. పలువురు వివిధ వ్యాధులతో మంచం పట్టారు. వీరిలో కొండతాంబిల్లి లింగన్న, కొండతాంబలి పూసే, కొండతాంబిల్లి .రవి, సునీత, అభి,.నిషాకా, అశోక్‌, చిన్ని, బిషీలతో పాటు 20 మంది మంచంపై పడి వైద్య కోసం ఎదురుచూస్తున్నారు. తక్షణమే మెడికల్‌ క్యాంప్‌ ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరారు.