Oct 01,2023 22:01

అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తున్న ఎమ్మెల్యే జోగారావు

పార్వతీపురంరూరల్‌: మండలంలో పెదబొండపల్లి, మూడడ్లవలస, గంగాపురంలో జల జీవన్‌ మిషన్‌ పథకం కింద పలు అభివృద్ధి పనులకు స్థానిక ఎమ్మెల్యే అలజంగి జోగారావు ఆదివారం శంకుస్థాపన చేశారు. ముందుగా పెదబొండపల్లిలో రూ.28.80 లక్షల అంచనా వ్యయంతో 40 కిలో లీటర్ల ఓవర్‌ హెడ్‌ మంచినీటి ట్యాంక్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన అనంతరం సుడిగాం పంచాయతీ మూడడ్లవలసలో రూ.15లక్షల అంచనా వ్యయంతో 20 కిలో లీటర్ల ఓవర్‌ హెడ్‌ మంచినీటి ట్యాంక్‌ నిర్మాణానికి శంకుస్థాపన నిర్వహించారు. అనంతరం గంగాపురం పంచాయతీలో రూ.12.80 లక్షల అంచనా వ్యయంతో 15 కిలో లీటర్ల ఓవర్‌ హెడ్‌ మంచినీటి ట్యాంక్‌ నిర్మాణానికి ఘనంగా పనులు ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపిడిఒ రమణమూర్తి, తహశీల్దార్‌ శివన్నారాయణ, ఎంపిపి మజ్జి శోభారాణి, జెడ్‌పిటిసి బలగ రేవతమ్మ, ఎఎంసి చైర్మన్‌ భాగ్యలక్ష్మి, సర్పంచ్‌లు, సవరపు తవుడమ్మ, పైల సూర్యనారాయణ, లక్ష్మి, నాయకులు చంద్రశేఖర్‌, శివాజి, బొమ్మి రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.