Mar 11,2023 22:52

ప్రజాశక్తి-నందిగామ 

నందిగామను నవ నందిగామ చేస్తాం అనే ముందు వేసవిలో పేదలకు ఉతాగునీరు సౌకర్యం కల్పించాల్సిన భాద్యత ఉందని సిపిఎం పట్టణ కార్యదర్శి కటారపు గోపాల్‌ పాలకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సిపిఎం ఆధ్వర్యంలో శనివారం నందిగామ డివిఆర్‌ కాలనీలో మహిళలు ఖాళీ బిందెలతో ధర్నా చేశారు. ఈ సందర్భంగా సిపిఎం నందిగామ మండల కార్యదర్శి కటారపు గోపాల్‌, సిపిఎం నాయకులు సయ్యద్‌ ఖాసిం మాట్లాడుతూ పట్టణంలోని ఉన్న 20 వార్డుల్లో మంచినీటి సమస్య చాలా ప్రధానమైన సమస్యగా ఉందన్నారు. మరీ ముఖ్యంగా నందిగామ పట్టణం 17, 18,16,14 వ వార్డులలో గత పది రోజుల నుండి కూడా మంచినీరు రాక ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికే ఎండలు ఎక్కువగా ఉన్న ప్రజలు మంచినీళ్లు ఎక్కువ అవసరం అవుతాయి కానీ మంచినీళ్లు తాగటానికి కూడా దొరకని పరిస్థితి నెలకొందన్నారు ఉందన్నారు. 90 కోట్లతో మంచినీటి సరఫరా పధకం ఎక్కడ వరకు వచ్చిందన్నారు.. అసలు ఇస్తారా లేదా..గత మూడు సంవత్సరాల నుండి చెబుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మంచినీళ్లు దొరక్కే నందిగామ 18 వ వార్డులో ప్రజలు రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. ట్యాంకర్ల ద్వారా ప్రజలకి మంచినీరు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు సయ్యద్‌ ఖాసిం, సిపిఎం నందిగామ కమిటీ సభ్యులు బత్తుల,వెంకటేశ్వర్లు ఉప్పు, శ్రీను కోటేశ్వరావు, నాగరాజు ,రోశయ్య, చంద్ర, సైదులు మహిళలు పాల్గొన్నారు.