Sep 19,2023 21:26

మంచి విలువలతో కూడిన జీవితాన్ని అలవరుచుకోవాలి

మంచి విలువలతో కూడిన జీవితాన్ని అలవరుచుకోవాలి

శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయ విసి ఆచార్య డి భారతి
ప్రజాశక్తి - క్యాంపస్‌ : తమ ప్రతిభను ప్రదర్శించడానికి విద్యార్థులకు ఇది మంచి తరుణమని, కాలేజీ వదలి వెళ్లాక కూడా ఇక్కడ నేర్చుకున్న విలువల్ని సేవా నిరతని కొనసాగించాలని, వర్క్‌ లైఫ్‌ బ్యాలెన్స్‌ మైంటైన్‌ చేయాలని విలువలతో కూడిన జీవితాన్ని గడపాలని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయ వైస్‌ ఛాన్స్‌లర్‌ ఆచార్య భారతి పేర్కొన్నారు. శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయ కాలేజ్‌ యాన్యువల్‌ , స్పోర్ట్స్‌ డే ని ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన వర్సిటీ విసి మాట్లాడుతూ కళాశాలలో నేర్చుకున్న విలువల్ని సేవా నిరతని విద్యార్థులు కొనసాగించాలని, వర్క్‌ లైఫ్‌ బ్యాలెన్స్‌ మైంటైన్‌ చేయాలని విలువలతో కూడిన జీవితాన్ని గడపాలని ఆకాంక్షించారు. అతిథిగా విచ్చేసిన వి.పి.ఆర్‌ ఫౌండేషన్‌ చైర్‌ పర్సన్‌ వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి మాట్లాడుతూ ఒడిదుడుకులకు తలవంచక పాజిటివ్‌ యాటిట్యూడ్‌ కలిగి ఉండాలని, చేసే పని పైన ఏకాగ్రత చూపి, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. ఈ సందర్భంగా ఆమె, వర్సిటీలో ఉన్న పద్మావతి అమ్మవారి దేవాలయానికి 5 లక్షల రూపాయలను విరాళం అందజేశారు. రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ రజనీ మాట్లాడుతూ సమిష్టి కషి ద్వారా వర్సిటీ ఉన్నత శిఖరాలకు చేసుకుందని, ఈ యూనివర్సిటీలో చదివిన విద్యార్ధులు అందరూ వారి వ్యక్తిగత జీవితంలో కూడా సాధికారత సాధించి ఆనందకరమైన జీవితం గడిపాలని కోరారు. స్పోర్ట్స్‌ డే సందర్భంగా నిర్వహించిన వివిధ రకాల ఆట పోటీల లో గెలుపొందిన విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో స్టూడెంట్‌ అఫైర్స్‌ డీన్‌ ప్రొఫెసర్‌ కాత్యాయని, డీన్లు ప్రొఫెసర్‌ సుజాత, ప్రొఫెసర్‌ అనూరాధ, ఇంజనీరింగ్‌ కాలేజ్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ మల్లికార్జున, నర్సింగ్‌ కాలేజ్‌ ప్రిన్సిపల్‌ డాక్టర్‌ గంగాభవాని, కల్చరల్‌ కోఆర్డినేటర్‌ ప్రొఫెసర్‌ శైలేశ్వరి, ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ డిపార్ట్మెంట్‌ హెడ్‌ ప్రొఫెసర్‌ సారా సరోజినీ, బోధన బోధనేతర సిబ్బంది, విద్యార్థినులు, తదితరులు పాల్గొన్నారు.