May 27,2023 16:27

వార్తాపత్రికలను చదివిస్తున్న గ్రంథాలయ అధికారిని మద్దమ్మ

మంచి నడవడికని అలవాటు చేసుకోవాలి
ప్రజాశక్తి -  పగిడ్యాల

       చిన్నతనం నుంచే మంచి నడవడికని అలవాటు చేసుకోవాలని గ్రంథాలయ అధికారిని కే మద్దమ్మ విద్యార్థులకు సూచించారు.గ్రంధాలయ వేసవి విజ్ఞాన శిక్షణ శిబిరాన్ని పగిడ్యాల గ్రంధాలయంలో శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రంథాలయ అధికారిని కే మద్దమ్మ మాట్లాడారు. చెడు అలవాట్లకు బానిస కాకుండా చిన్నతనం నుంచి మంచి అలవాట్లు, మంచి నడవడిక అలవరుచుకున్నప్పుడే జీవితం ఆనందంగా ఉంటుందన్నారు. మంచి అలవాట్లు అలవర్చుకోవడం వలన సమాజంలో మంచి గుర్తింపు మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. మంచి అలవాట్లు నేర్చుకోవడం వల్ల నేటి బాలలే రేపటి భావి భారత పౌరులవుతారని విద్యార్థులకు సూచించారు. చిన్నతనం నుంచి మంచి పుస్తకాలను చదవడం అలవాటు చేసుకోవాలన్నారు. ఊహలత, జ్యోతి అనే విద్యార్థులు కలర్ పేపర్లతో డిజైన్ తయారు చేయడం జరిగిందన్నారు.  అనంతరం విద్యార్థులకు ఆటలు పాటలు నేర్పించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో 20 మంది విద్యార్థులు పాల్గొన్నారు.