తాడేపల్లి: బాలలు భవిష్యత్తులో మంచి మెజీ షియన్లుగా తయారు కావాలని ప్రముఖ ఇంద్రజాలికులు క్రాంతికార్ ఆకాంక్షించారు. అమరావతి బాలోత్సవం, మంగళగిరి-తాడేపల్లి బాలోత్సవం ఆధ్వర్యంలో ఈ నెల 5వ తేదీ నుంచి కుంచనపల్లి అరవింద హైస్కూల్, విజయవాడ బాలోత్సవ భవన్ పిల్లలకు మ్యాజిక్ శిక్షణ బుధవారంతో పూర్తయ్యింది. గురువారం విజయవాడలోని ఎంబివికెలోని ఆడిటోరియంలో పుర ప్రముఖులు, పెద్దలు, పిల్లల తల్లిదండ్రులు వందలాది మంది ప్రజల ముందు తాము నేర్చుకున్న మ్యాజి క్‌ను ప్రదర్శించనున్నారు. ఇందుకు సంబం ధించి ట్రైల్స్ బుధవారం పిల్లలకు నేర్పించారు. సుమారు పది రకాల మ్యాజిక్ ట్రిక్కులు పిల్లలు నేర్చుకున్నారు. విశ్రాంత ఎంపిడిఒ ఆదినారాయణ తన కళ్లకు గం తలు కట్టుకుని బ్లాక్ బోర్టుపై పిల్లలు సూచిం చిన పండ్ల పేర్లను చెప్పి అం దరినీ ఆశ్చర్యచకితులను చేశారు. ఈ సందర్భంగా క్రాంతికార్ మాట్లాడుతూ గత 13 రోజుల నుంచి అత్యంత క్రమశిక్షణతో మ్యాజిక్‌లో శిక్షణ పొందిన పిల్లలకు అభినందనలు తెలిపారు. నేర్చుకోవాలనే పట్టుదల, కృషి పిల్లల్లో ఉన్నట్లు తాను గమనించినట్లు చెప్పారు. ఇదే స్ఫూర్తిని భవిష్యత్తులో కూడా కొనసాగిం చాలని కోరారు. వచ్చే సమ్మర్ మ్యాజిక్ క్యాంపులో మరింత ఎక్కువ మంది శిక్షణకు హాజరై ఈ ప్రాంతంలో అధిక సం ఖ్యలో మేజీషియన్లు ఉన్నారనే సంకేతాలు ప్రజలు అందజేయాలన్నారు. మంగళగిరి తాడేపల్లి బాలోత్సవం, విజయవాడ ఎంబి విజ్ఞాన కేం ద్రం మ్యాజిక్ నేర్చుకునే పిల్లలను శిక్షణకు తీసుకురావ డానికి చొరవ చూప డం అభినందనీయ మన్నారు. మ్యాజిక్ నేర్చుకోవ డం ద్వారా చురుగ్గా పని చేయగలుగుతారని చెప్పారు. మూఢనమ్మకా లకు దూరంగా ఉం డాలన్నారు. అత్యంత నైపుణ్యత పిల్లల్లో ఉం దని కొనియాడారు. మంగళగిరి తాడేపల్లి బాలోత్సవం కోశాధి కారి గాదె సుబ్బారెడ్డి మాట్లాడుతూ 13 రోజుల పాటు శిక్షణ ఇవ్వడానికి కుంచనపల్లి అరవింద హైస్కూల్ యాజమాన్యం సహకరించినందుకు ప్రిన్సి పాల్ బి.ఇంద్రా ణికి అభినందనలు తెలి పారు. గురువారం విజయవాడ రాఘవయ్య పార్కు వద్ద గల ఎంబి విజ్ఞాన కేంద్రంలో 13 రోజుల పాటు నేర్చుకున్న వివిధ రకాల మ్యాజిక్‌ను బాల మేజీషియన్లు అందరి ముం దు ప్రదర్శిస్తా రని చెప్పారు. సాయంత్రం మూడు గంటల నుంచి మరొకసారి పిల్లలకు మ్యాజిక్ ప్రదర్శనకు సంబంధించిన మెళ కువలు క్రాంతికార్ నేర్పిస్తారని తెలిపారు. సాయంత్రం ఆరు గంటలకు పిల్లల మ్యాజిక్ షో ప్రారంభమవు తుందని తెలిపారు.










