Jun 15,2023 23:37

తెనాలి: విద్యార్థులు పాఠశాల దశలోనే మంచి లక్ష్యాలను ఎంచుకుని, దానికి అనుగుణంగా శ్రమించాలని జెడ్పీ చైర్‌ పర్సన్‌ కత్తెర హెనిక్రిస్టీనా అన్నారు. స్థానిక రామకృష్ణ కవి కళాక్షేత్రంలో గురువారం జగనన్న ఆణిముత్యాలు పేరిట స్టేట్‌ బ్రిలియంట్‌ అవార్డులను నియోజకవర్గ స్థాయిలో పదోతరగతిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అం దించారు. స్థానిక రామకృష్ణ కవి కళాక్షేత్రంలో నిర్వహించిన కార్యక్రమంలో జెడ్పీ చైర్‌పర్సన్‌ ముఖ్యఅతిధిగా పాలొ ్గన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైసిపి ప్రభు త్వంలో విద్యావ్యవస్థలో గణనీయమైన మార్పులు చోటు చేసుకున్నాయన్నారు. సిఎం జగన్‌ నేతృత్వంలో నాడు-నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో పూర్తి స్థాయి మౌలిక వసతులు కల్పించటం విశేషమన్నారు. తమ వంతు బాధ్యతగా ప్రతి పాఠశాలకు ఆల్‌ ఇన్‌ ఒన్‌ పుస ్తకాలను పం పిణీ చేసినట్లు చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో అందించే సదుపాయాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవా లన్నారు. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సయ్యద్‌ ఖలేదానశీం మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన ఫలితాలు సాధిస్తున్నారని, డి.ఇందిర మున్సిపల్‌ బాలికోన్నత పాఠశాలల్లో చదివి 588 మార్కులు సాధించిన వి.దాక్షా యినిని ఉదాహరణగా చెప్పారు. విద్యార్థులను ప్రోత్సహిం చేందుకు, వారిలో పోటీ తత్వాన్ని పెంచేందుకు ప్రభుత్వం వారిని సత్కరిస్తోందని చెప్పారు. ఉత్తమ ప్రతిభ కనబరిచి, నియోజకవర్గంలో ప్రథమ స్థానంలో నిలిచిన విన్నకోట దాక్షాయినికి రూ.15 వేలు నగదు, ద్వితీయస్థానం పొందిన పెదరావూరు జెడ్పీహెచ్‌ఎస్‌ విద్యార్థిని పల్లికోట రాజ్యలక్ష్మికి రూ.10 వేలు, తృతీయ స్థానం పొందిన అత్తోట జెడ్పీహెచ్‌ఎస్‌ విద్యార్ధి అద్దంకి గోవర్ధననాయుడుకు రూ.5 వేలు నగదుతో పాటు షీల్డులను అందించి, సత్కరించారు. కార్యక్రమంలో అసిస్టెంట్‌ కమిషనర్‌ గోపాలరావు, మండల విద్యాధికారి ఎం.లక్ష్మినారాయణ, ఎంపిపి చెన్నుబోయిన శ్రీనివాసరావు, జెడ్పీటిసి పిల్లి ఉమాప్రణతి, పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు.
ఉత్తమ విద్యాబోధన, తల్లిదండ్రుల ప్రోత్సాహం
తెనాలి రూరల్‌: ఉత్తమ విద్యాబోధన, తల్లి దండ్రుల ప్రోత్సాహంతో తెనాలి డివి జన్‌ స్థాయిలో అత్యధిక మార్కులు సాధించ గలిగాను. అదనపు క్లాసుల నిర్వహణలో అధ్యాపకులు ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ఫలితంగా తెనాలి డివిజన్‌ స్థాయిలో 2022-2023 సంవత్సరానికి జరిగిన పదవ తరగతి పరీక్షల్లో 588 మార్కులు సాధించ గలిగానని గర్ల్స్‌ హై స్కూల్‌ విద్యార్థిని విన్నకోట దాక్షణ్య తెలిపారు. స్టేట్‌ బ్రిలియన్స్‌ అవార్డు అందుకోవడానికి వచ్చిన దాక్షణ్య, ప్రజాశక్తికి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. తల్లిదండ్రులు శ్రీనివాసరావు, నీలిమలు బండిపై పానీపూరి విక్రయిస్తుం టారని చెప్పింది. రోజుకు నాలుగు గంటలు పాటు అదనంగా చదువుకున్నానని, తరగతుల్లో ఉపాధ్యాయులు నేర్పిన బోధనాంశాలను అర్థం చేసుకుంటే ఉత్తమ ఫలి తాలు సాధించవచ్చని తెలిపింది.
చేబ్రోలు: నారాకోడూరు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల విద్యార్థులు దాసరి భానుశ్రీ 586 మార్కులతో ప్రథమ స్థానంలో, డి.భరణి (584) ద్వితీయ స్థాన ంలో నిలిచారని ప్రధానోపాధ్యాయులు ఎం.ఏడుకొండలు తెలిపారు. పొన్నూరు శ్రీరామ పురపాలక ఉన్నత పాఠశాల ఆవరణలో నిర్వహించి కార్యక్రమంలో పొన్నూరు ఎంపిపి భవనం పద్మలీల విద్యా ర్థులకు జ్ఞాపికలు, నగదు బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో పొన్నూరు మండల విద్యాశాఖ అధికారి రుద్రపాటి శోభాచంద్‌ విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు.