Nov 16,2022 23:57

మాట్లాడుతున్న ఆనంద్‌, లింగమూర్తి

ప్రజాశక్తి-హుకుంపేట:ప్రజల గొంతుకగా నిలిచే మీడియా ప్రజాస్వామ్యానికి నాల్గవ స్తంభం అని, మంచి కథనాలు రాస్తే విలేకర్లకు గుర్తింపు ఉంటుందని ఎపిటిఅర్‌ఏ మండల అధ్యక్షులు, కార్యదర్శి కె.ఆనంద్‌, పి.లింగమూర్తి తెలిపారు. మండలం కేంద్రలోని స్టూడియోలో జాతీయ పత్రికా దినోత్సవం బుధవారం నిర్వహించారు. ముందుగా మృతి చెందిన జర్నలిస్టులకు మౌనం పటించారు. అనంతరం కేక్‌ కటింగ్‌ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, నిజాన్ని నిజాయితీగా నిర్బయంగా రాసినప్పుడే పత్రిక రంగంలో విలేకరిగా గుర్తింపు వస్తుందన్నారు. భవిష్యత్తులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తోన్న తీరుపై మీడియా పై కథనాలు రాయాలన్నారు.ఈ కార్యక్రమం లో పాండు, నాగరాజు, నూకరాజు, శ్రీను పాల్గొన్నారు.