Apr 08,2023 00:06
ర్యాలీ నిర్వహిస్తున్న కావూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్ర సిబ్బంది

ప్రజాశక్తి-చెరుకుపల్లి: ఆరోగ్యమే మహాభాగ్యం అని ప్రతి ఒక్కరూ మంచి ఆహార అలవాట్లు కలిగి, ఆహ్లాదకరమైన వాతావరణంలో జీవించాలని కావూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యులు డాక్టర్‌ శ్రీ లతాబాయి అన్నారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా కావూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ శ్రీలతాబాయి మాట్లాడుతూ ఆరోగ్యకరమైన వాతావరణంలో జీవించాలని కోరారు. పరిసరాల పరిశుభ్రతతో పాటు, నాణ్యమైన పౌష్టికాహారం తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సూపర్‌వైజర్‌, ఆశ కార్యకర్తలు సిబ్బంది పాల్గొన్నారు.