Aug 22,2023 20:58

ఇండోర్‌స్టేడియంలో పరిశీలిస్తున్న కలెక్టర్‌

ఇండోర్‌స్టేడియంలో పరిశీలిస్తున్న కలెక్టర్‌
మల్టీపర్పస్‌ ఇండోర్‌ స్టేడియంలో పరిశీలన
ప్రజాశక్తి-నెల్లూరు:రూరల్‌ మండలం మొగళ్లపాలెంలో మల్టీపర్పస్‌ ఇండోర్‌ స్టేడియాన్ని వినియోగంలోకి తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ ఎం హరి నారాయణన్‌ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఉదయం ఇండోర్‌ స్టేడియాన్ని జిల్లా కలెక్టర్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ నిర్మాణం పూర్తి చేసుకున్న ఇండోర్‌ స్టేడియాన్ని అన్ని వసతులతో వినియోగంలోకి తీసుకురావాలన్నారు. క్రీడాకారులకు అన్ని మౌలిక సదుపాయాలు సమకూర్చాలని సూచించారు.
కలెక్టర్‌ వెంట సెట్నాల్‌ సీఈవో నాగరాజు కుమారి, ఆర్డిఓ మలోల, చీఫ్‌ కోచ్‌ యతిరాజ్‌ తదితరులు ఉన్నారు.