Oct 29,2022 23:55

ఆసుపత్రి భవన నిర్మాణాన్ని పరిశీలిస్తున్న ఐటిడిఎ పిఒ సూరజ్‌ గనోరే

ప్రజాశక్తి-రాజవొమ్మంగి
రంపచోడవరం డివిజన్‌ కేంద్రంలో చేపడుతున్న మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ పనులను వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి సూరజ్‌ గనోరే ఆదేశించారు. శనివారం రంపచోడవరం ఏరియా ఆసుపత్రి ప్రాంగణంలోని నిర్మిస్తున్న మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పూర్తి నాణ్యతా ప్రమాణాలతో నిర్మాణ పనులు చేపట్టాలని కోరారు. అనంతరం పీఓ ముసురుమెల్లి బాలుర ఆశ్రమ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎన్ని రోజులకు సరిపడా కూరగాయలు కాంట్రాక్టర్‌ సరఫరా చేస్తుందని ఆరా తీశారు. ఆశ్రమ పాఠశాలకు వచ్చిన పప్పులు, బియ్యం తదితర నిత్యవసర వస్తువులు ఏవిధంగా ఉన్నవి పిఒ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.