Mar 21,2023 00:50
మల్లు స్వరాజ్యంకు నివాళి అర్పిస్తున్న దృశ్యం

ప్రజాశక్తి-మేదరమెట్ల: తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, వీరవనిత కామ్రేడ్‌ మల్లు స్వరాజ్యం ప్రథమ వర్థంతిని సోమవారం మండలంలోని ప్రాసంగలపాడు గ్రామంలో సిపిఎం గ్రామ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్య క్రమంలో గ్రామ కమిటీ సభ్యులు చావా కోటేశ్వరరావు, కంచర్ల సుధాకర్‌రావు, కంచర్ల హరిబాబు, ఎన్‌ రాజారావు, కంచర్ల శ్రీనివాసరావు, నక్కల పెద్ద అంజయ్య, కెవిపిఎస్‌ మండల బాధ్యులు కంచర్ల సురేష్‌ బాబు తదితరులు పాల్గొన్నారు.