Mar 20,2023 20:19

కామ్రేడ్‌ మల్లు స్వరాజ్యం ప్రథమ వర్ధంతి నివాళులర్పిస్తున్న దృశ్యం

మల్లు స్వరాజ్యం ఆశయ సాధనకు కృషి
ప్రజాశక్తి - బండి ఆత్మకూర్‌

మల్లు స్వరాజ్యం ఆశయ సాధనకు కృషి చేయాలని సిపిఎం, సిఐటియు నాయకులు అన్నారు. మల్లు స్వరాజ్యం ప్రథమ వర్ధంతిని సిపిఎం సిఐటియు ఆధ్వర్యంలో సోమవారం బండి ఆత్మకూరు మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి రత్నమయ్య, రైతు సంఘం నాయకుడు రామచంద్రుడు, డివైఎఫ్‌ఐ నాయకులు రాజేష్‌, వ్యవసాయం కార్మిక సంఘం అధ్యక్షుడు సుబ్బారాయుడు, కార్యదర్శి డేవిడ్‌ మాట్లాడుతూ తెలంగాణ నిజాం రాజ్యానికి వ్యతిరేకంగా రజాకర్ల అరాచకాలకు వ్యతిరేకంగా సాయిధ పోరాటంలో పాల్గొన్న మల్లు స్వరాజ్యం తుది శ్వాస విడిచే వరకు కమ్యూనిస్టు యోధురాలుగా జీవించారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు రాజు, తదితరులు పాల్గొన్నారు.