May 23,2023 17:10

తెలంగాణ హైకోర్ట్‌ న్యాయమూర్తికి స్వాగతం పలుకుతున్న అధికారులు

మల్లన్నను దర్శించుకున్న తెలంగాణ హైకోర్ట్‌ న్యాయమూర్తి
ప్రజాశక్తి - శ్రీశైలం

        శ్రీశైల క్షేత్రంలోని భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్లను మంగళవారం తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి నామవరపు రాజేశ్వరరావు కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. ముందుగా స్వామి అమ్మవార్లను దర్శించుకునేందుకు ఆలయ రాజగోపురం వద్దకు న్యాయమూర్తి కుటుంబ సమేతంగా చేరుకున్నారు. వీరికి ఆలయ సంప్రదాయం ప్రకారం దేవస్థానం అధికారులు, వేద పండితులు స్వాగతం పలికారు. ఆ తర్వాత ముందుగా స్వామివారిని, అనంతరం అమ్మవారిని ప్రత్యేకంగా దర్శించుకున్నారు.