మల్లన్నను దర్శించుకున్న ప్రముఖులు
ప్రజాశక్తి - శ్రీశైలం
శ్రీశైల క్షేత్రంలోని భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్లను ఆదివారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ప్రముఖులలో భారత ప్రభుత్వ భారీ పరిశ్రమల శాఖ మంత్రి డాక్టర్ మహేంద్ర నాథ్ పాండే కుటుంబ సభ్యులు, ఎపి రాష్ట్ర శాసనసభ గౌరవ స్పీకర్ తమ్మినేని సీతారామ్ కుటుంబ సమేతంగా దర్శించుకున్న వారిలో ఉన్నారు ఉన్నారు. వీరు విడివిడిగా స్వామి అమ్మవార్లను దర్శించుకునేందుకు ఆలయ రాజగోపురం వద్దకు చేరుకోగానే ఆలయ అధికారులు సాంప్రదాయం ప్రకారం స్వాగతం పలికారు. ఆ తర్వాత విడివిడిగా స్వామి వారిని ముందుగా దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. ఆ తర్వాత అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని వేద ఆశీర్వచన మండపంలో వీరికి విడివిడిగా వేద పండితులు ఆశీర్వచనం పలికారు. శేష వస్త్రాలను, ప్రసాదాలను, జ్ఞాపికను దేవస్థానం అధికారులు అందజేశారు.










