Jul 09,2023 21:02

జ్ఞాపికను అందజేస్తున్న ఆలయ అధికారులు

మల్లన్న సన్నిధిలో హైకోర్టు న్యాయమూర్తి
ప్రజాశక్తి - శ్రీశైలం

     శ్రీశైల క్షేత్రంలోని భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్లను ఆదివారం రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి పి.శ్యాంసుందర్‌ కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. ముందుగా వీరు స్వామి అమ్మవార్లను దర్శించుకునేందుకు ఆలయ రాజగోపురం వద్దకు చేరుకోగానే ఆలయ అధికారులు, వేద పండితులు సంప్రదాయపదంగా స్వాగతం పలికారు. అనంతరం ముందుగా స్వామివారిని, ఆ తర్వాత అమ్మవారిని ప్రత్యేకంగా దర్శించుకున్నారు. అనంతరం అమ్మవారి ఆలయ ప్రాంగణంలో వారికి వేదపండితులు ఆశీర్వచనం పలికారు. వారికి శేష వస్త్రాలను, ప్రసాదాలను, జ్ఞాపికను ఆలయ అధికారులు అందజేశారు.