Oct 12,2023 17:00

హుండీలో భక్తులు చెల్లించుకున్న కానుకలను లెక్కిస్తున్న దృశ్యం

మల్లన్న హుండీ ఆదాయం రూ.3.17 కోట్లు
ప్రజాశక్తి శ్రీశైలం

    శ్రీశైల క్షేత్రంలోని భ్రమరాంబ మల్లికార్జున స్వామి వాళ్లకు మరియు పరివార దేవుళ్లకు గడిచిన 28 రోజులలో భక్తులు హుండీలలో చెల్లించుకున్న కానుకలను గురువారం నాడు కళ్యాణ మండపంలో లెక్కించడం జరిగింది.  ఈ హుండీ లెక్కింపులో నగదురూ 3,17,50,290/- లు  హుండీలో లభించాయి.  వీటితోపాటు  బంగారం 108 గ్రాములు 300 మిల్లీగ్రాములు,వెండి  6 కేజీల 340 గ్రాములు,  హుండీలలో లభించాయి. అంతేకాక విదేశీ కరెన్సీలు  యూఎస్ఏ డాలర్లు 243,  ఆస్ట్రేలియా డాలర్లు 450, కెనడా డాలర్లు 40,  యూఏఈ దిరహంస 15,  సింగపూర్ డాలర్లు 6,  యూరోస్ 5,  వంటి విదేశీ కరెన్సీలు హుండీలలో లభించాయి. ఈ హుండీ లెక్కింపు పటిష్టమైన భద్రత ఏర్పాట్ల మధ్య సీసీ కెమెరాల  నిఘాలో ఈ లెక్కింపు జరిగింది.  ఈ హుండీ లెక్కింపు కార్యనిర్వహణాధికారి పెద్దిరాజు ఆధ్వర్యంలో దేవస్థానం సిబ్బంది శివసేవకులు లెక్కించడం జరిగింది.  అని అధికారులు తెలిపారు.