
బాలేరులో సంచరిస్తున్న ఏనుగులు
భామిని: మండలంలోని గత ఐదు నెలల పాటు కనిపించని ఏనుగులు సోమవారం బాలేరు, నల్లారాయిగూడ పంచాయతీ పరిధిలో గల ఇసుకగూడ, సన్నాయిగూడ జీడీతోటలో 4 ఏనుగుల గుంపు సంచారిస్తున్నాయి. ప్రస్తుతం వరి, వాణిజ్య పంటలైన చెరకు ఏపుగా పెరిగిన నేపథ్యంలో ఏనుగులు కదలికలపై రైతులు ఆందోళన చెందుతున్నారు. వంశధార కుడి కాలువ అవతలి వైపు వున్న ఏనుగులు, కాలువ వంతెన మీదుగా దాటితే, మండలంలోని మైదాన ప్రాంతంలో పంటలు నాశనం చేసే అవకాశం ఉందని రైతులు తెలిపారు.