సమస్యలు తెలుసుకుంటున్న నాయకులు
ప్రజాశక్తి - ఆదోని
వచ్చే 2024 ఎన్నికల్లో మళ్లీ వైసిపి ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదిస్తే మరిన్ని సంక్షేమ పథకాలు అందిస్తామని మున్సిపల్ ఛైర్మన్ బోయ శాంత, వైసిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జీ జయ మనోజ్ రెడ్డి తెలిపారు. గురువారం పట్టణంలోని 36వ వార్డు బీరప్ప నగర్‌లో 'గడపగడపకు మన ప్రభుత్వం' నిర్వహింంచారు. వారు ప్రతి గడపకూ తిరుగుతూ సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం వారు మాట్లాడారు. పాదయాత్రలో ప్రజలకు మాట ఇచ్చిన ప్రకారం నవరత్నాలతోపాటు అనేక సంక్షేమ పథకాలను 98 శాతం అందించిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికే దక్కతుందన్నారు. వైసిపి పట్టణ అధ్యక్షులు బి.దేవా, కౌన్సిలర్లు సందీప్ రెడ్డి, వైస్ ఛైర్మన్ నరసింహులు, మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి, ఆర్‌ఐ జయరామి రెడ్డి, నాయకులు ఉన్నారు.ష










