
జెండాను ఆవిష్కరిస్తున్న దృశ్యం
మళ్లీ జగనే సిఎం
- ఆత్మకూరు వైఎస్‌ఆర్సిపి నాయకులు
ప్రజాశక్తి ఆత్మకూరు అర్బన్:ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ఆయన అందచేస్తున్న నవరత్నాల సంక్షేమ పథకాలతో ప్రతి ఇంటా సంక్షేమం, ఆనందంగా ఉన్నాయని పలువురు వైఎస్సార్సీపీ నాయకులు అన్నారు. గురువారం ఆత్మకూరు మున్సిపల్ పరిధిలోని ఇరిగేషన్ కార్యాలయం సచివాలయం పరిధిలో సంక్షేమ పథకాల డిస్ ప్లే బోర్డులను మున్సిపల్ చైర్ పర్సన్ గోపారం వెంకటరమణమ్మ ఆవిష్కరించారు. అనంతరం ఎందుకు ఆంధ్రాకు జగనే కావాలి ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జెసీయస్ కన్వీనర్ డాక్టర్ సీహెచ్ ఆదిశేషయ్య, పట్టణకన్వీనర్ అల్లారెడ్డి ఆనంద్ రెడ్డిలు మాట్లాడుతూ నాడు ప్రజా సంకల్ప పాదయాత్రలో ఇచ్చిన మాట మేరకు జగనన్న ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఎటువంటి లోటు లేకుండా సంక్షేమ పథకాలు అందిస్తున్నారన్నారు.కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బల్లి నాగేశ్వరరావు, వైస్ చైర్మన్లు షేక్ సర్థార్, డాక్టర్ కెవి శ్రావణ్ కుమార్, వార్డు కౌన్సిలర్లు పుచ్చలపల్లి రాధిక, కొప్పోలు రమాదేవి, తోకల తిరుపతమ్మ, సచివాలయ కన్వీనర్లు కొత్తపల్లి శ్రీనివాసులు, సుబ్బారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.