Apr 10,2023 19:40

వైఎస్‌ఆర్‌ ఆసర మెగా చెక్కును మహిళకు అందచేస్తున్న ఎమ్మెల్యేఆర్థర్‌

మళ్లీ ఎమ్మెల్యే కావాలని లేదు : ఎమ్మెల్యే ఆర్థర్‌

ప్రజాశక్తి - పగిడ్యాల

మరోసారి ఎమ్మెల్యే కావాలని ఆశ లేదని, ఇప్పటికే నష్టపోయానని నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్‌ అన్నారు. సోమవారం మండల కేంద్రం పగిడ్యాలలో మూడవ విడత వైఎస్‌ఆర్‌ ఆసరా చెక్కు పంపిణీ కార్యమ్రానికి ముఖ్యఅతిథిగా హజరైయ్యారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడారు. పాదయత్రలో ఇచ్చిన హమీలను సిఎం జగన్‌ అమలు చేస్తున్నారన్నారు. వైఎస్‌ఆర్‌ ఆసర కింద నియోగజక వర్గానికి రూ 27కోట్ల 29 లక్షల 82 వేల 829 మంజురైనట్లు ఆయన తెలిపారు. తాను మరల ఎమ్మెల్యే కావాలని అనుకోవడంలేదని ఉన్నంతవరకు సేవ చేస్తానన్నారు. రాష్ట్ర హౌసింగ్‌ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ గంగిరెడ్డిగారి రమాదేవి మాట్లాడతూ జగనన్న మహిళలకు ఇచ్చిన హమీలన్నీ అమలు చేస్తున్నారని అన్నారు. నవరత్నలు ప్రవేశ పెట్టి ప్రతి పథకాని ప్రజల వద్దకు చేరుస్తున్నారన్నారు. మాజీ జెడ్పిటిసి పుల్యాల నాగిరెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వానికి జగనన్న ప్రభుత్వానికి ఎంతో తేడా ఉందన్నారు. ఎంపిపి మండ్ల మలేశ్వరి మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా ఎదిగినప్పుడే రాష్ట్రం అభివృద్ది చెందుతుందన్నారు. జిల్లా ఎస్సీ సెల్‌ అధ్యక్షులు సగినేల వెంకటరమణ మాట్లాడుతూ గత ప్రభుత్వల మాట నీటిమీ రాతలాంటివన్నారు. అనంతరం ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి, మహిళలకు మెగా చెక్కును అందజేేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పిటిసి పుల్యాల దివ్వ, సర్పంచు పెరుమాళ్ల శేషన్న, ఎంపిటిసి గోపాల్‌, ఎంపిడిఒ వెంకటరమణ, తహశీల్దార్‌ భారతి, ఎంఇఒ సుభాన్‌, ఇఒఆర్‌డి పుల్లయ్య,సిఐ సుధకార్‌రెడ్డి,ఎస్‌ఐ నాగర్జున, వైసిపి నాయకులు వెంకటరెడ్డి,రామకృష్ణ,సత్యనారయణరెడ్డి, వెంకటేశ్వర్లు, వైసిపి నాయకులు,కార్యకర్తలు, పొదుపు సంఘాల మాహిళలు పాల్గొన్నారు.