Dec 19,2022 23:28

ఆర్‌ఒ ప్లాంట్‌ను పరిశీలిస్తున్న గిరిజన సంఘం నేత నాగేశ్వరరావు తదితరులు

ప్రజాశక్తి-చింతూరు
మండలంలోని మల్లెతోట గ్రామంలో ఆర్‌ఒ ప్లాంట్‌కు మరమ్మతులు చేయాలని గిరిజన సంఘం మండల కార్యదర్శి కారం నాగేశ్వరరావు డిమాండ్‌ చేశారు. సోమవారం ఆయన మల్లెతోట గ్రామస్తులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. వరద ముంపులో ఆర్‌ఓ ప్లాంట్‌ పూర్తిగా మునిగిపోయి, నాటి నుండి పనిచేయటం లేదని తెలిపారు. ఇప్పటికీ 5 నెలలైనా సచివాలయం సిబ్బంది, స్థానిక ప్రజా ప్రతినిధులు, మండల అధికారులు దీని గురించి పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. జల్‌ జీవన్‌ మిషన్‌ పైపులైన్ల సగం వరకు ఏర్పాటు చేసి, టేప్స్‌ వేయకుండా మధ్యలోనే విడిచిపెట్టారని తెలిపారు. దీంతో నీటి సమస్య తీవ్రంగా ఉందన్నారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ ఆర్‌ఓ ప్లాంట్‌, జల్‌ జీవన్‌ మిషన్‌ పనులను తక్షణమే పూర్తి చేయాలని, లేకుంటే ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం మండల నాయకులు ధర్ముల మల్లయ్య, వీర భద్రం, రామయ్య, గ్రామస్తులు పాల్గొన్నారు.
ప్రజాశక్తి-చింతూరు