ప్రజాశక్తి-వన్‌టౌన్: దుర్గగుడి అభివద్ధి పనులలో భాగంగా గత కొంతకాలంగా జరుగుతున్న మల్లేశ్వరస్వామి ఆలయాన్ని త్వరితగతిన పూర్తిచేసి అందుబాటులోకి తేవాలని రాష్ట్ర దేవాదాయ శాఖ స్థపతి పరమేశ్వరప్ప ఆలయ ఇంజనీరింగ్, కాంట్రాక్టర్లకు తెలిపారు. ఈ నేపధ్యంలో మంగళవారం నిర్మాణంలో ఉన్న శ్రీ మల్లేశ్వర స్వామి వారి ఆలయ ప్లాన్ మరియు పనులను రాష్ట్ర దేవాదాయశాఖ స్థపతి పరమేశ్వరప్ప పరిశీలించి పనుల స్టేటస్, విగ్రహాలల తయారీ, నవగ్రహ ఆలయ నిర్మాణ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా నూతనంగా నిర్మిస్తున్న ఆలయ పనులలో ఆలయ శ్లాబు పని పూర్తయి శిఖరం పనులు జరుగుచున్నాయని స్థపతికి అధికారులు తెలియజేశారు. ఆలయ అభివద్ది పనులు త్వరితగతిన పూర్తిచేయాలని కాంట్రాక్టరు వారికి కొన్ని సూచనలు జారీచేశారు. ఈ కార్యక్రమంలో దుర్గగుడి ఇఒ దర్భముళ్ళ భ్రమరాంబ, ఆలయ స్థానాచార్యులు విష్ణుభట్ల శివప్రసాద శర్మ, కార్యనిర్వాహక ఇంజినీర్ కోటేశ్వరరావు పాల్గొన్నారు.










