అమరావతి: మండల పరిధిలోని మల్లాదిలో రూ.15 లక్షల ఎంపి లాడ్స్ నిధులతో ఎస్సీ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి ఆది వారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో నరసరావ ుపేట పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు, పెదకూరపాడు శాసనసభ్యులు నంబూరు శంకరరావు పాల్గొన్నారు. ఎస్సీ కాలనీలో సామాజిక అవసరా లకు, ప్రజ లకు ఎక్కువగా ఉపయోగపడే కమ్యూ నిటీ హాల్ నిర్మా ణంపై స్థానికులు హర్ష వ్యక్తం చేశారు. కార్యక్రమంలో వైసిపి నాయకులు భవిరి శెట్టి హనుమంతరావు, క్రోసూర్ వ్యవసాయ మార్కెట్ యార్డు చైర్మన్ ఈదా సాంబిరెడ్డి, మాజీ వ్యవసాయ మార్కెట్ యార్డు చైర్మన్ వెంపా జ్వాల లక్ష్మీనరసింహారావు తోపాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు.
కోల్డ్ స్టోరేజ్ పనుల పరిశీలన
నాబార్డు నిధులతో జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ సహకారంతో అమరావతి మండలం 14వ మైలు- ఉంగుటూరు మధ్య నిర్మిసున్న కోల్డ్ స్టోరేజీ నిర్మాణ పను లను ఎమ్మెల్యే నంబూరు శంకరరావు ఆదివారం పరిశీలించారు. 95 వేల బస్తాల నిల్వ సామర్థ్యం గల ఈ కోల్డ్‌స్టోరేజ్‌ను రూ.9.75 కోట్లతో నిర్మిస్తున్నారు. రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని, చొరవ చూపి, నిధులు మంజూరు చేయించి, త్వరితగతిన కోల్డ్ స్టోరేజ్ ని పూర్తిచేస్తున్న ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు చెబుతున్నట్లు రైతులు తెలిపారు.










