నీటిని పరిశీలిస్తున్న అధికారులు
ప్రజాశక్తి -యస్.రాయవరం:మండలంలోని సర్వసిద్ధి ప్రాధమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని పలు గ్రామాల్లో ఫ్రై డే... డ్రై డే కార్యక్రమం నిర్వహించారు. జిల్లా మలేరియా నివారణాధికారి వరహాలు ఆదేశాల మేరకు యాంటీ లార్వా ఆపరేషన్లు చేశారు. ఈ కార్యక్రమం లో భాగంగా మండల కేంద్రంలో రెవిన్యూ కార్యాలయం ఎదురుగా ఉన్న మురుగు నీటి కాలువల పరిసరాలు వైద్య సిబ్బంది పరిశీలించారు.ఈ కార్యక్రమంలో ఆరోగ్య విస్తరణాధికారులు నాగేశ్వరరావు, బి.సత్యన్నారాయణ, నోడల్ ఆఫీసర్ ప్రసాద్, స్థానిక సచివాలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.










