Jun 01,2023 19:04

ర్యాలీ నిర్వహిస్తున్న ఆరోగ్య సిబ్బంది

ప్రజాశక్తి - దేవనకొండ
మలేరియా వ్యాధి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అసిస్టెంట్‌ మలేరియా అధికారి చంద్రశేఖర్‌ తెలిపారు. మలేరియా మాసోత్సవాల్లో భాగంగా మండలంలోని బంటుపల్లి గ్రామంలో గురువారం మలేరియా అవగాహన పట్ల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ నెల 1 నుంచి 30 వరకు రాష్ట్రవ్యాప్తంగా మలేరియా మాసోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని గ్రామస్తులకు సూచించారు. అపరిశుభ్ర ప్రాంతాల్లో బ్లీచింగ్‌ పౌడర్‌, ఫాగింగ్‌ వంటి చర్యలు ఆరోగ్య సిబ్బందితో తీసుకున్నారు. మలేరియా సబ్‌ యూనిట్‌ అధికారి సాయి బాబా, హెల్త్‌ సూపర్‌ వైజర్లు ఈశ్వరయ్య, శ్రీధర్‌, ఉమబాయి, ఎఎన్‌ఎం రాధాబాయి, ఆశాలు పాల్గొన్నారు.