Apr 25,2023 22:46

తాళ్లరేవులో ర్యాలీ నిర్వహిస్తున్న గాడిమొగ పిహెచ్‌సి సిబ్బంది


ప్రజాశక్తి - యంత్రాంగం
ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా మంగళవారం వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని ముఖ్య కేంద్రాల్లో పిహెచ్‌సి, సిహెచ్‌సిల సిబ్బంది మలేరియా వ్యాధి నివారణపై అవగాహన ర్యాలీలు నిర్వహించారు.
తాళ్లరేవు మండలం గాడిమొగ పిహెచ్‌సి ఆధ్వర్యంలో తాళ్ళరేవు మెయిన్‌ రోడ్డు మీదుగా అవగాహన ర్యాలీ నిర్వహించారు. దోమలు పెరగకుండా పరిసరా లలో పరిశుభ్రత పాటించాలని ప్రజలకు సూచించారు. నీటి నిల్వలు లేకుండా ఎప్పుడు కప్పుడు తొలగించాలని అన్నారు. కార్యక్రమంలో ఎఎంసి చైర్మన్‌ కుడుపూడి శివన్నారాయణ, తహశీల్దార్‌ పోతురాజు, గాడిమొగ పిహెచ్‌సి హెల్త్‌ సూపర్వైజర్‌ ఎం.ఇబ్రహీం, పి.హెచ్‌. ఎన్‌.సుభాషిణి, హెల్త్‌ ఎడ్యు కటర్‌ సీతామహలక్ష్మి, హెల్త్‌ సూపర్వైజర్లు రంజన్‌, రాజేశ్వరి, హెల్త్‌ అసిస్టెంట్లు కె.ఆంజనేయులు, అలీషా, ఆదినారాయణ, అభినవ్‌, శ్రీనివాస్‌, ఎఎన్‌ఎంలు భవాని, జ్యోతి, ఎంఎల్‌హెచ్‌పిలు, ఆశ వర్కర్లు, అంగన్‌ వాడీలు పాల్గొన్నారు. గండేపల్లి పిహెచ్‌సి వైద్యాధికారిని డాక్టర్‌ సౌమ్య అధ్యకతన సమావేశం నిర్వహించి గ్ర్రామంలో ర్యాలీ నిర్వహించి, మలేరియా వ్యాధి నిర్మూలన, ప్రజల్లో అవగాహనా కల్పించారు. కార్యక్రమంలో డాక్టర్‌ దీప్తి చందన, సూపర్వైజర్లు రూతమ్మ, చెల్లారావు హెలినా, ఎంఎల్‌ఎహెచ్‌పిలు, హెల్త్‌ అసిస్టెంట్‌లు, ఎఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. ఏలేశ్వరం కమిషనర్‌ కే ఏ కొండలరావు ఆధ్వర్యంలో వైద్యాధికారి శ్రీలక్ష్మి, డాక్టర్‌ పాపారావు, మలేరియా యూనిట్‌ అధికారి ఆనంద్‌ ఎంపిహెచ్‌ఇఒ భాస్కరరావు, వైద్య సిబ్బంది అవగాహన ర్యాలీ నిర్వహించారు.