Jun 02,2023 21:49

ప్రజాశక్తి - ఉంగుటూరు
           మలేరియా నివారణలో ప్రజల భాగస్వామ్యం కావాలని చేబ్రోలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు కోరారు. శుక్రవారం చేబ్రోలు పిహెచ్‌సిలో వైద్యాధికారులు డాక్టర్‌ కెఎస్‌.వర్మ, డాక్టర్‌ శ్రావన్‌ కుమర్‌ రెడ్డి అధ్యక్షతన మలేరియా మాసోత్సవాలు తాడేపల్లిగుడెం సబ్‌ యూనిట్‌ అధికారి వైవి.లక్ష్మణరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. మలేరియా నిర్ధారణ పరీక్షలు ఆరోగ్య కేంద్రాలు, వైఎస్‌ఆర్‌ హెల్త్‌ క్లినిక్స్‌లలో అందుబాటులో ఉంటాయని చెప్పారు. నివారణ చర్యల్లో భాగంగా దోమతెరలు వాడాలని, ఇంటి కిటికీలకు, తలుపులకు జాలీలు బిగించుకోవాలని చెప్పారు. పరిసరాల పరిశుభ్రతతో దోమల ద్వారా వచ్చే వ్యాధులను నివారింవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య సహాయకులు కాంతారావు, వార్డు ఆరోగ్య కార్యదర్శులు పరమేశ్వరి, ఎంఎల్‌హెచ్‌పి చంద్రకళ, ఆశాలు, ఆరోగ్య సహాయకులు వెంకటస్వామి, వాలంటీర్లు పాల్గొన్నారు.