ప్రజాశక్తి - రంపచోడవరం
మలేరియా, డెంగీ వ్యాధులు ప్రబలకుండా ప్రతి గ్రామంలో దోమలు నివారణకు చర్యలు తీసుకుంటున్నట్లు రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి సూరజ్ గనోరే పేర్కొన్నారు. శుక్రవారం రంపచోడవరం, చింతూరు డివిజన్ల పరిధిలోని 11 మండలాలలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు సంబంధించిన వైద్యాధికారులు, ఎంపీడీవోలు, మలేరియా సబ్ యూనిట్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్, మరి కొంతమంది అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు డివిజన్లోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో మలేరియా డెంగు నివారణ కొరకు ప్రత్యేక దష్టి పెట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పిహెచ్‌సిల్లో గత నెల ఈనెల ఎన్ని రక్త పరీక్షలు చేసింది ఎంతమందికి మలేరియా డెంగు ఉన్నది పీహెచ్‌ఈ ల వారిగా ప్రాజెక్ట్ అధికారి ఆరా తీశారు. ఏజెన్సీలోని ప్రతి గిరిజన ఆశ్రమం పాఠశాలలో మలేరియా స్పెల్లింగ్, దోమలు నివారణకు సంబంధించిన పొగ చేయించాలని సూచించారు. అవసరం ఉన్న ప్రతి ప్రభుత్వ ఆసుపత్రికి రక్త పరీక్షకు సంబంధించిన కిట్లు సరఫరా చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రతిరోజు డెంగ్యూ మలేరియాకు సంబంధించిన రిపోర్టులు సమర్పించాలన్నారు. ఈ సమావేశంలో అడిషనల్ డిఎంఎల్‌హెచ్‌ఓ డాక్టర్ పుల్లయ్య, ఎంపీడీవోలు హరికృష్ణ. ఎం బాబన్న దొర, రత్నకుమారి, వైద్యాధికారులు నరేష్, డాక్టర్ రాధిక, మలేరియా ఏఎంవో నక్క వెంకటేశ్వరరావు, సబ్ యూనిట్ అధికారి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.










