Apr 19,2023 23:02

ప్రజాశక్తి-విజయవాడఅర్బన్‌: మలబార్‌ గోల్డ్‌ అండ్‌డైమండ్స్‌ కొత్త ఆభరణాలను ప్రజలకు అందించేందుకు బ్రైడల్‌ క్యాంపెయిన్‌ ప్రారంభించినట్లు మలబార్‌ ఎం.జి.రోడ్డు షోరూమ్‌ మేనేజర్‌ నిఖిల్‌ చంద్రన్‌ తెలిపారు. ఎం.జి.రోడ్డులోని షోరూమ్‌లో బుధవారం సాయంత్రం విలేకరుల సమావేశం ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవి సందర్భంగా ప్లాగ్‌షిప్‌ బ్రైడల్‌ క్యాంపెయిన్‌ను ప్రారంభించినట్లు తెలిపారు. క్యాంపెయిన్‌ను ప్రజలకు తెలియచేసేందుకు ఆలియాభట్‌ను బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమించి ప్రచారం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఎప్పటికపుడు సరికొత్తగా ఆభరణాలను అందించేందుకు మలబార్‌ గోల్డ్‌ సంస్థ ముందుంటుందని తెలిపారు. ఇందులో భాగంగా సినీ తారలతో ప్రచార కార్యక్రమాలతో ప్రతి ఒక్కరి ముందుకు తమ ఆభరణాలను తీసుకువెళ్లి అందిస్తున్నామని తెలిపారు. మలబార్‌ సంస్థ ఆభరణాల ప్రేమికులకు మరింత చేరువకావడానికి విస్తరించే క్రమంలో సినీ తారలతో ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు.