- మా నమ్మకం పవన్ అనే స్టిక్కర్లను ఇంటింటికి అతికించిన తిరుపతి జనసేన పార్టీ
:ప్రజాశక్తి-తిరుపతి అర్బన్ : నాలుగున్నర సంవత్సరం పరిపాలనలో ఈ రాష్ట్రానికి రాజధాని లేక, యువతకు ఉద్యోగాలు లేక, ఉద్యోగులకు జీతాలు సరిగా అందక, నిత్యవసర ధరలు ఇష్టం వచ్చినట్లు పెంచి ప్రజలను అష్ట కష్టాలకు గురిచేసి దివాలా తీసే పరిస్థితిలో ఆంధ్ర రాష్ట్రం ఉందని ప్రతి ఒక్కరి పైన రెండు లక్షలు రూ అప్పు పెట్టిన ఈ అధికార పార్టీ ఏ ముఖం పెట్టుకొని మా నమ్మకం జగన్ అనే స్టిక్కర్లను ఇంటింటికి వైసీపీ కార్యకర్తలలా గ్రామ వాలంటరీలతో అతికిస్తున్నారని, ఈ ముఖ్యమంత్రి చివరకు స్టిక్కర్లు అతికించుకునే పరిస్థితికి దిగజారిపోయాడని జనసేన పార్టీ తిరుపతి ఇంచార్జ్ కిరణ్ రాయల్, పట్టణ అధ్యక్షుడు రాజారెడ్డి మరియు ముఖ్య నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ కీర్తన, లక్ష్మి, హేమ కుమార్, లావణ్య, చంద్ర, కొండా రాజమోహన్, సుమన్ బాబు, షరీఫ్, మునస్వామి, వినొద్, సాయి దేవ్, హేమంత్, సుజిత్, రాజేష్ ఆచారి, సాయి, పురుషోత్తం రాయల్, ఆది కేశవులు మరియు రాష్ట్ర, జిల్లా, పట్టణ కమిటీ నాయకులు జనసైనికులు, వీరమహిళలు తదితరులు పాల్గొన్నారు.










