Nov 01,2022 21:16

ప్రజాశక్తి - టి.నరసాపురం
             మండలంలోని మక్కినవారిగూడెం హైస్కూల్‌లో నిర్వహిస్తున్న నియోజకవర్గ స్థాయి బాలికల క్రీడా పోటీలను మక్కినవారిగూడెం సొసైటీ చైర్‌పర్సన్‌ పిన్నమనేని చక్రవర్తి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలికలు క్రీడలపట్ల ఆసక్తి పెంచుకోవాలని సూచించారు. స్థానిక జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ప్రారంభమైన పోలవరం నియోజకవర్గ స్థాయి కబడ్డీ, ఖోఖో పోటీల్లో మండల స్థాయి స్కూల్‌ గేమ్స్‌లో ఎంపికైన 400 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారని, నియోజకవర్గ స్థాయిలో ఎంపికైన క్రీడాకారులు జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని హైస్కూల్‌ ప్రధానోపాధ్యాయులు జి.ప్రసాద్‌ తెలిపారు. ఈ కార్యక్రమంలో పేరెంట్స్‌ కమిటీ ఛైర్మన్‌ టి.నాగమణి, జిల్లా స్కూల్‌ గేమ్స్‌ కార్యదర్శి డి.రాజేంద్రప్రసాద్‌, నియోజకవర్గ ఇన్‌ఛార్జి కె.నాగేశ్వరరావు, పిన్నమనేని రాధాకృష్ణ, శ్రీరామమూర్తి పాల్గొన్నారు.