ప్రజాశక్తి - టి.నరసాపురం
మండలంలోని మక్కినవారిగూడెం జడ్‌పి హైస్కూల్లో సోమవారం తహశీల్దార్ జెవి.సుబ్బారావు ఆక్రమణలను తొలగించారు. హైస్కూల్ గ్రౌండ్‌లో స్థలాన్ని స్థానికులు కొందరు ఆక్రమించి పశువులను కట్టేస్తుండడం వల్ల విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని పాఠశాల హెచ్‌ఎంఎల్.వెంకటేశ్వరరావు పలుమార్లు ఆక్రమణదారులను హెచ్చరించినప్పటికి వారి తీరు మారకపోవడంతో తహశీల్దార్‌కి ఫిర్యాదు చేశారు. దీంతో రెవెన్యూ, పోలీసు సిబ్బందితో కలిసి తహశీల్దార్ ఆక్రమణల తొలగింపుకు చర్యలు చేపట్టారు. ఆక్రమణలు తొలగించి పాఠశాల గ్రౌండ్‌లో ఎటువంటి ఆక్రమణలు చేపట్టకుండా ఉండేందుకు ఇటుకలతో గోడ నిర్మాణానికి ఆదేశాలు జారీ చేయడంతో, పాఠశాల సిబ్బంది గోడ నిర్మించారు.










