
ప్రజాశక్తి - మంగళగిరి : చేనేత మజూరిని పెంచాలని కోరుతూ శనివారం స్థానిక పాత మంగళగిరి కళ్యాణ మండప వద్ద నుంచి మాస్టార్ వీవర్స్ అసోసియేషన్ వరకు జరిగే చేనేత కార్మికుల ప్రదర్శనను జయప్రదం చేయాల నాయకులు కోరారు. ఈ మేరకు మంగళగిరి చేనేత కార్మిక సంఘాల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో భార్గవ్‌పేట, ఆంజనేయ కాలనీ, సాయి నగర్, బాలాజీ నగర్, నాగారం బొమ్మ సెంటర్ తదితర ప్రాంతాల్లోని మగ్గాల షెడ్ల లోని చేనేత కార్మికులను శుక్రవారం కలిసి ప్రచారం చేశారు. కార్యక్రమంలో కమిటీ కన్వీనర్ పి.బాలకృష్ణ, తెలుగు నాడు చేనేత కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు జి.ధనుంజయరావు, పట్టణ ప్రధాన కార్యదర్శి జె.వెంకట సుబ్బారావు, ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం ఉపాధ్యక్షులు పి.నాగేశ్వరరావు, చేనేత కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు ఆర్.పూర్ణచంద్రరావు, ప్రజాతంత్ర చేనేత కార్మిక సంఘం నాయకులు కె.కోటేశ్వరరావు, ఏరియా చేనేత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు జి.వెంకటకృష్ణ, కార్యదర్శి బి.మోహన్రావు, పట్టణ కార్యదర్శి డి.ఈశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి డి.రామారావు పాల్గొన్నారు.