May 24,2023 00:35

మజ్జిగ పంపిణీని ప్రారంభిస్తున్న తహశీల్దారు

ప్రజాశక్తి- రేపల్లె : వేసవిలో మజ్జిగ పంపిణీ అభినందనీయమని తహశీల్దారు మల్లికార్జున రావు తెలిపారు. రేపల్లె పట్టణంలో పెద్ద మార్కెట్‌ సెంటర్‌ లో పట్టణ ఆదర్శ వేదిక ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీని తహశీల్దారు మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా తహశీల్దారు మాట్లాడుతూ పట్టణ ఆదర్శ వేదిక మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల ప్రజలు ఎండల తీవ్రతను గమనించి పట్టణ ఆదర్శ వేదిక ఇలాంటి కార్యక్రమం చేపట్టడం అభినందనీయమన్నారు. మజ్జిగ పంపిణీ కార్యక్రమానికి సహకరించిన దాతలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పావులూరి కష్ణమోహన్‌, కన్నా రాంబాబు, యజ్ఞపత రవితేజగారు, వెంక టేశ్‌, ఆదర్శవేదిక కార్యదర్శి యనపల్లి కిషోర్‌, సాయి కష్ణమాచార్యులు, కె.రాంబాబు, పి.రాజు, కష్ణమోహన, శ్రీనువాసరావు, పూర్ణగారు, వర్షిని, అనూష, శిరీష తదితరులు పాల్గొన్నారు.