May 01,2023 01:38
చలివేంద్రాన్ని ప్రారంభిస్తున్న దృశ్యం

ప్రజాశక్తి-వేటపాలెం: హృదయ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో స్థానిక రామానగర్‌లోని డాక్టర్‌ మధు క్లినిక్‌ ఆవరణలో అసోసియేషన్‌ సభ్యుడు కీర్తిశేషులు పింజల భాస్కర్‌ (డిఈఈ, సిపిడీసిఎల్‌) స్మారక చలివేంద్రం ఏర్పాటు చేశారు. ఆదివారం మజ్జిగ పంపిణీ కార్యక్రమానికి అసోసియేషన్‌ సభ్యుడు ఎంవిఎన్‌ మూర్తి (రమణ) రెండు వేల రూపాయలు ఆర్థిక సాయం అందించారు. ఈ చలివేంద్రాన్ని బైన మల్లికార్జునరావు ప్రారంభించారు. వేసవి దాహార్తిని తీర్చడానికి ఇలాంటి మంచి కార్యక్రమాలు చేయడం ఎంతో సంతోషదాయకమని బండ్ల బాపయ్య కాలేజ్‌ పిడి మాస్టరు బండ్ల బాపయ్య అన్నారు. వేసవిలో మజ్జిగ తాగటం ఎంతో ఆరోగ్యమని గణిత శాస్త్ర అధ్యాపకులు కోటేష్‌ అన్నారు. నేటి నుంచి మే నెల 30వ తేదీ వరకు జరిగే చలివేంద్రం కార్యక్రమానికి పింజల అనురాధ రూ.15 వేల ఆర్థిక సాయం అందించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ నన్నపనేని సునీల్‌ కుమార్‌, వైస్‌ ప్రెసిడెంట్‌ బొడ్డు శివయ్య, జనరల్‌ సెక్రెటరీ గుగ్గిలం శ్రీహరి, డాక్టర్‌ మధు, వూట్ల వెంకటేశ్వర్లు, బాలాజీ, (బాలాజీ స్టూడియో అధినేత), బుద్ధి శీను, మస్తాన్‌, ధరణి కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.